విడాకుల తర్వాత నాజూగ్గా తయారైన హీరోయిన్
Hansika Motwani looks stunning after divorce
పాలబుగ్గల హన్సిక రీసెంట్ గా భర్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకుని విడిపోయింది. స్నేహితురాలి భర్తను ప్రేమించి ఎంతో వైభవంగా వివాహం చేసుకున్న హన్సిక పెళ్ళైన రెండేళ్లకే భర్త నుంచి దూరంగా వచ్చేసింది. ఆతర్వాత విడాకులకు అప్లై చెయ్యడం ముంబై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చెయ్యడం జరిగిపోయాయి.
పెళ్లి తర్వాత కెరీర్ డల్ అయిన హన్సిక విడాకుల తర్వాత ఆ బాధను మర్చిపోయేందుకు వెకేషన్ కు వెళ్ళొచ్చింది ఆతర్వాత ఆమె ఫ్రెష్ గా కెరీర్ పై ఫోకస్ పెడుతున్నట్టుగా అనిపించేలా హన్సిక సోషల్ మీడియా లుక్స్ ఉంటున్నాయి. ఒకప్పుడు కాస్త బబ్లీ గా కనిపించిన హన్సిక ఇప్పుడు విడాకుల తర్వాత మరింత నాజూగ్గా తయారైంది.
తాజాగా బ్లాక్ మోడ్రెన్ డ్రెస్ లో హన్సిక షేర్ చేసిన పిక్స్ చూసిన నెటిజెన్స్ హన్సిక విడాకుల తరవాత బాగా షైన్ అయ్యింది, మళ్లీ కెరీర్ లో బిజీ అయ్యేందుకు తహతహలాడుతోంది అందుకే ఇలా గ్లామర్ షూట్స్ వదులుతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.







































