వైసీపీ కి మంత్రి నారా లోకేష్ మాస్ వార్నింగ్
Minister Nara Lokesh's mass warning to YSRCP
మే 27 బుధవారం టిడిపి ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టే మహానాడు ఘనంగా మొదలు కాగా ఈ కార్యక్రమం ఈఏడాది డిజిటల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మంత్రి లోకేష్ ప్రత్యర్థి పార్టీ కి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ డిజిటల్ గా హైబ్రిడ్ విధానంలో మహానాడు జరుగుతున్నప్పటికీ టీమ్ -11 కి బ్యాటింగ్ తప్పదంటూ మంత్రి నారా లోకేష్ డైరెక్ట్ గానే వైసీపీ కి వార్నింగ్ ఇచ్చారు.
డిజిటల్ అయినా, లేదంటే డైరెక్ట్ అయినా ఈ మహానాడు మాస్ జాతర తలపించడమే కాదు ఇది సూపర్ హిట్. పసుపు పండుగ కు కేరాఫ్ మహానాడు. ప్రతి టీడీపీ కార్యకర్త కాలర్ ఎగరేసి నేను తెలుగు వాడిని, నాది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునే వేదిక ఈ మహానాడు. నేషన్ ఫస్ట్ అనేది తెలుగుదేశం పార్టీ విధానం.
ఈ ఏడాది మహానాడు కార్యక్రమం ను నెల్లూరులో భారీగా నిర్వహించాలనుకున్నాం. కానీ మన దేశం - మన బాధ్యత. ప్రధాని మోదీ సూచించిన మార్గాన్ని మనం ఫాలో అవుతూ... ప్రత్యేక పరిస్థితుల్లో హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తున్నాం. మనం హైబ్రిడ్ మోడల్ అనగానే టీమ్ 11 సంబరాలు చేసుకున్నారంట. ఆఫ్‌లైన్ అయినా, హైబ్రిడ్ మోడల్ అయినా టీమ్ 11 కి బ్యాటింగ్ తప్పదు అంటూ మినిస్టర్ నారా లోకేష్ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.







































