ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Gaddar: Public singer Gaddar passed away

ప్రజా గాయకుడు గద్దర్‌ ఇకలేరు

Gaddar: Public singer Gaddar passed away

ప్రజా గాయకుడు గద్దర్‌ అలియాస్‌ గుమ్మడి విఠల్‌ రావు (74) ఇకలేరు. అనారోగ్యంతో ఆయన ఆదివారం కన్నుమూశారు. గుండెపోటుతో కొద్దిరోజుల కిందట అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో గద్దర్‌ను పలువురు ప్రముఖులు పరామర్శించారు. 

ఇంతలోనే ఆయన కన్నుమూయడం బాధాకరం. ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్‌ పీపుల్స్‌ వార్‌, అనంతరం మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో తన గళంతో కోట్లాది మంది ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు. గద్దర్ మరణం పట్ల పలువురు ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేసుకురాలంటూ సంతాపం తెలియజేస్తున్నారు. 

Popular singer Gaddar passes away

gaddar passes away