ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sudheer Babu, Harshavardhan Production No 5 Launched

హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు

Sudheer Babu, Harshavardhan Production No 5 Launched

ప్ర‌స్తుతం ప‌లు ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ల‌తో మ‌న ముందుకు రాబోతున్నారు హీరో సుధీర్ బాబు. తన కెరీర్‌లో 15వ చిత్రంగా హర్షవర్ధన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు. సోనాలి నారంగ్‌, సృష్టి స‌మ‌ర్ఫ‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.5గా  నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సుధీర్ బాబు కోసం ఒక భిన్న‌మైన క‌థ‌ను రెడీ చేశారు ద‌ర్శ‌కుడు హ‌ర్ష వ‌ర్ధ‌న్‌. ఈ సినిమాలో ఇంత వ‌ర‌కూ చూడ‌ని స‌రికొత్త అవతారంలో సుధీర్ బాబు క‌నిపించ‌నున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ రోజు హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది.

ముహూర్త‌పు షాట్‌కు నిర్మాత పుస్కుర్‌ రామ్‌మోహ‌న్ రావు క్లాప్ కొట్టి  స్క్రిప్ట్‌ను ద‌ర్శ‌కుడికి అంద‌జేశారు. వ‌చ్చే వారం నుండి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభంకానుంది.

ఇంకా పేరు పెట్ట‌ని ఈ చిత్రంలో ప్ర‌ముఖ న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల‌లో న‌టించ‌నున్నారు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా పీజీ విందా సినిమాటోగ్ర‌ఫి భాధ్య‌తలు  నిర్వ‌హిస్తున్నారు. రాజీవ్ ఆర్ట్ డైరెక్ట‌ర్. ఇత‌ర న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో తెలుప‌నున్నారు.

Sudheer Babu, Harshavardhan, Sree Venkateswara Cinemas LLP Production No 5 Launched

sudheer babu
harshavardhan
sree venkateswara cinemas llp
production no 5
sudheer babu movie launched