బిగ్ బాస్ 10: ఎన్నిసార్లు కాపాడుతారయ్యా
Bigg Boss Telugu 10: No elimination this week?
ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ వర్షిణి ని ఈ సీజన్ లో ఎన్నిసార్లు కాపాడతారయ్యా అంటూ ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. వర్షిణి, సుధీర్ ఇద్దరూ ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన వాళ్ళు. కానీ వాళ్ళను ఏదో ఒకసాకుతో హౌస్ లోనే ఉంచుతున్నారనే అభిప్రాయాలు ఆడియన్స్ వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నోసార్లు బోటం లైన్ దగ్గరకు వెళ్లొచ్చిన వర్షిణి ని సేవ్ చేస్తూనే ఉన్నారు. ఈ వారం ఆమె ఎలిమినేషన్ పక్కా అనుకున్న సమయంలో దివాళీ రోజు నో ఎలిమినేషన్ అన్నారట. దసరా అప్పుడు కూడా శాలినిని ఎలిమినేట్ అని సీక్రెట్ రూమ్ లో ఉంచారు. ఇప్పుడు ఈ వారం వర్షిణి ఎలిమినేట్ అవ్వకుండా దీపావళి ఎపిసోడ్ కాపాడింది అంటున్నారు.
అది చూసే ఎన్నిసార్లు ఆ వర్షిణి ని బిగ్ బాస్ కాపాడుతాడు, మళ్లీ ఈ వారం ఏదో ఒక ఇమ్యూనిటీ ఇచ్చి సేవ్ చేస్తారు, ఫ్యామిలీ వీక్ అంటూ గోల గోల చేస్తారు. నాగార్జున కూడా వర్షిణి తప్పులు చెప్పకుండా ఆమెకు పొటన్షియల్ ఉంది అంటూ పొగుడుతారంటూ ఆడియన్స్ బిగ్ బాస్ పై ఫైర్ అవుతున్నారు.
















































