ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Regina Cassandra questions Karan Johar

జాన్వీ, రాధికా కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన రెజీనా

Regina Cassandra questions Karan Johar Regina Cassandra questions Karan Johar


ఈమధ్యన పెద్ది చిత్రంలో తన గ్లామర్ షో పై జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్, అలాగే లెజెండ్ మూవీలో రాధికా ఆప్టే తన రోల్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో... అంతకుమించి జాన్వీ, రాధిక లపై ట్రోల్స్ కనిపించాయి. మిమ్మల్ని ఎవరూ బలవంతంగా సినిమా కోసం ఒప్పించలేదు, మీరు ఇష్టపడి చేసిన సినిమాలపై ఎందుకంత విషం కక్కడం అంటూ ఇచ్చిపడేసారు నెటిజెన్స్.

అలాగే టాలీవుడ్ ప్రొడ్యూసర్ SKN కూడా హీరోయిన్స్ చేస్తున్న కామెంట్స్ పై చేసిన వ్యాఖ్యలు హాట్ హాట్ గా తిరుగుతున్న సమయంలో నటి రెజీనా నార్త్ ఇండస్ట్రీ అలాగే ధర్మ ప్రొడక్షన్, జాన్వీ కపూర్, రాధికా ఆప్టే లకు లెఫ్ట్ అండ్ రైట్ పీకిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో తీవ్ర సంచలనముగా మారాయి. రెజీనా నార్త్ vs సౌత్ ఇండస్ట్రీ పై మాట్లాడుతూ..

బాలీవుడ్ నటులు సౌత్‌ ఇండియన్ సినిమా గురించి మాట్లాడేటప్పుడు.. వారు నార్త్‌, మరియు సౌత్‌ మధ్యలో గొడవలు సృష్టించేలా మాట్లాడితే నాకు సమస్య. నేను హిందీలో నటించిన ధర్మ ప్రొడక్షన్స్ సినిమా కేసరి చాప్టర్ 2 కు చెందిన నిర్మాత కరణ్ జోహార్.. నన్ను ఆ సినిమా ప్రమోషన్స్ కి దూరం చేసారు. ఆ సినిమాలో నా పాత్రకు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ నన్ను ప్రమోట్ చేయకూడదని నిర్ణయించుకున్నారు.

నాకు ఇంటిమేట్ చెయ్యకుండానే ప్రమోషన్ల నుంచి నా పేరును తొలగించారు. నేను నటించిన పాటను విడుదల చేశారు.. దాని ప్రమోషన్స్ లో కనీసం నన్ను ట్యాగ్ కూడా చేయలేదు. దీనికి  నేనేం అనాలి, అంటే నేను సౌత్‌ ఇండియన్ నటిని కావడం వల్లేనా అంటూనే..

జాన్వీ కపూర్, రాధికా ల గురించి మాట్లాడుతూ.. మీపై ఎవరూ అత్యాచారం చేయడం లేదు కదా, ఒక ప్రాజెక్ మీకు నచ్చకపోతే, అందులో నటించమని ఎవరూ బలవంతం చెయ్యరు, ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుని, ఆ విషయాన్ని బయటపెటండి. అంతే తప్ప ఆ సినిమా పూరయ్యాక దీని గురించి మాటాడటం కరెక్ట్ కాదు.

అందులోను నార్త్ - సౌత్ ఇండస్ట్రీస్ మధ్యన విద్వేషాన్ని రెచ్చగొటడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. జాన్వీ, రాధిక ఇదరికీ ఆ సినిమా నుంచి తప్పుకునే అవకాశం ఉంది. నేనూ ఒక మహిళనే కాబట్టి మహిళల పక్షాన నిలబడటం నాకు సులభమే, కానీ ఈ విషయంలో నేను వారిని సమర్ధించలేను అంటూ రెజీనా జాన్వీ కపూర్, రాధికా ఆప్టే లకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసింది. 

Regina Cassandra Alleges Sidelining by Karan Johar