సూర్య యానివర్సరీ వేడుకలతో భర్తలకు తప్పని తిప్పలు!
Karthi says Suriya and Jyotika's romantic celebration left husbands in troubleకోలీవుడ్ స్టార్ సూర్య -జ్యోతిక దంపతుల వివాహ వార్షికోత్సర వేడుకలు కుటుంబానికే కాకుండా ఇళ్లలోని ఇతర భర్తలకు కూడా ఓ రకంగా సమస్యగా మారాయని కార్తీ సరదాగా వ్యాఖ్యానించారు. సూర్య-జ్యోతికల అన్యోన్యతను చూసి ఇళ్లలోని భార్యలు తమ భర్తలను కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నారని.. దీంతో చాలా చోట్ల భర్తలకు తిప్పలు తప్పడం లేదని సరదాగా చెప్పుకొచ్చారు.
సూర్య, జ్యోతిక ఇటీవల 20వ వివాహ వార్షికోత్సరాన్ని కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య విదేశాలలో ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఆ వేడుకలో భాగంగా పెళ్లి విషయాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. ఈ జంట ప్రేమను బహిరంగంగా వ్యక్తపరిచే విధానం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కార్తీ మాట్లాడుతూ.. `అన్నా- వదినల మధ్య ప్రేమ చాలా ఎక్కువ. వారి వివాహ వేడుకను చూసిన భార్యలు.. తమ భర్తలను కూడా వారిలాగే ఉండమని అడుగుతున్నారు. మా వదిన చూపించే ప్రేమ వల్ల నా భార్య చేతిలో నేను ఎన్నిసార్లు దెబ్బలు తిన్నానో చెప్పలేను` అంటూ నవ్వులు పూయించారు.
అలాగే సోషల్ మీడియాలో యానివర్సరీ సెలబ్రేషన్స్ చూసిన తర్వాత ఇళ్లలో భార్యలు భర్తలను నిలదీస్తున్నారని.. కనీసం సరిగ్గా భోజనం కూడా పెట్టడం లేదని కార్తీ చమత్కరించారు. ఇదే వేదికపై సూర్య మాట్లాడుతూ జీవితంలో ఎదురైన కష్ట సమయాల్లో జ్యోతిక తన చేయి పట్టి ముందుకు నడిపించిందని ఎమోషనల్ అయ్యారు. మంచి భార్య దొరకడం నిజంగా దేవుడిచ్చిన వరమని.. తన విజయాలన్నింటి వెనుక జ్యోతిక పాత్ర ఎంతో ఉందని సూర్య కొనియాడారు.
















































