ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Suriya get meals from his home every single day!

సూర్య ఇంటి నుంచే డైలీ క్యారియ‌ర్!

Suriya get meals from his home every single day!Suriya get meals from his home every single day!

మలయాళ యువ నటుడు నస్లెన్ - సూర్య ప్రధాన పాత్రలో న‌టిస్తోన్న‌ `సీన్` చిత్రం ద్వారా తమిళ పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. జితు మాధవన్ దర్శకత్వం వహిస్తున్న  సినిమా నవంబర్ 6న  విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చెన్నైలో జరిగిన  ప్రమోషన్ ఈవెంట్‌లో నస్లెన్ మాట్లాడారు. తమిళంలో తాను నటించిన తొలి సినిమా ఇదే అయినా? ఇక్కడి ప్రేక్షకులు త‌న‌పై చూపిస్తున్న‌ ఆప్యాయతను చూసి   భావోద్వేగానికి గురయ్యానని  తెలిపారు.

షూటింగ్ సమయంలో సూర్య చూపిన దయను.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. షూటింగ్ జరిగే ప్రతి రోజూ సూర్య గారు ఇంటి నుంచి   లంచ్ బాక్స్ నుండి మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని  పంపేవారన్నారు. ఆ భోజనంలో సూర్య‌ ప్రేమ కూడా ఉండేదన్నారు.

షూటింగ్ సమయంలో సూర్య పడిన కష్టం.. అంకితభావం తనపై  ప్రభావం చూపాయని నస్లెన్ కొనియాడారు. రాత్రి 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కష్టతరమైన షిఫ్ట్‌లలో షూటింగ్ ముగిసిన తర్వాత కూడా సూర్య  తాజాదనంతో.. ఉత్సాహంగా ఉండేవారని తెలిపారు. ఒక స్టార్ హీరోగా ఆయన  అంకితభావం తనలాంటి యువ నటులకు స్ఫూర్తినిస్తుందని ప్రశంసించారు.

Suriya