ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Why Is Varanasi's Release Date In The News Again?

వారణాసి రిలీజ్ పై ఎందుకన్ని అనుమానాలు

Why Is Varanasi's Release Date In The News Again?Why Is Varanasi's Release Date In The News Again?


ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కుతున్న వారణాసి చిత్రం ఏప్రిల్ 7, 2027 న విడుదలవుతుందా.. ఇప్పుడు ఇదే సినిమా ఇండస్ట్రీ లో హాట్ హాట్ గా డిస్కర్షన్ జరుగుతుంది. అసలు ఈ అనుమానం ఎలా పుట్టింది. ఈమధ్యన రాజమౌళి ఓ ఈవెంట్ లో హోప్ ఫుల్లీ ఏప్రిల్ 7 న వారణాసి విడుదల అవుతుంది అంటూ మాట్లాడిన మాటలు ఇంకా ఇంకా అనుమానాలు రాజేశాయి.

అందుకే వారణాసి విడుదల తేదీపై నెలకొన్న అనుమానాల దృష్యా రాజమౌళి తండ్రి, ప్రముఖ రైటర్ విజయేంద్రప్రసాద్ గారిని మరోసారి మీడియా ప్రశ్నించింది. దానికి ఆయన వారణాసి 2027, ఏప్రిల్ 7 రిలీజ్ అంటూ చెప్పారు. అయినప్పటికీ వారణాసి పోస్ట్ పోన్ వార్తలు ఆగడం లేదు.

ఇప్పటికే షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయ్యింది. మహేష్ తో చిన్న చిన్న వర్క్స్ మిగిలి ఉన్నాయని, ఓ పది రోజులు చేస్తే వారణాసి షూటింగ్ మొత్తం పూర్తవుతుంది, పోస్ట్ ప్రొడక్షన్ తో ఈక్వల్ గా సీజీ వర్క్, అంతకుమించి ప్రమోషన్స్ జరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో వారణాసి రిలీజ్ పోస్ట్ పోన్ వార్తలేమిటో ఏమిటో అర్ధం కాక మహేష్ ఫ్యాన్స్ అయోమయ పడుతున్నారు.

Varanasi Movie Release Date Rumors