సీనియర్ మనవరాలికి తాత నుంచి అరుదైన గిప్ట్!
Karisma Kapoor on her cherished vintage timepieceబాలీవుడ్ నటి కరిష్మా కపూర్ ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబానికి చెందిన అరుదైన వారసత్వ సంపద గురించి పంచుకున్నారు. మొదటి వాచ్‌ను తండ్రి రణ్‌ధీర్ కపూర్ బహుమతిగా ఇచ్చారని.. అసలు ఆ వాచ్‌కు అంతకంటే ముందు తాతగారైన దిగ్గజ నటుడు, దర్శకనిర్మాత రాజ్ కపూర్ సొంతమని వెల్లడించారు. ఈ వింటేజ్ గడియారం కేవలం ఒక టైమ్‌పీస్ మాత్రమే కాదు రెండు తరాలకు చెందిన మధుర జ్ఞాపకాలను, అపారమైన భావోద్వేగాలను తనలో నింపుకుందని కరిష్మా తెలిపారు.
కాలంతో పాటు ఫ్యాషన్ మారుతున్నా? 90ల కాలం నాటి కొన్ని బ్యూటీ ట్రెండ్స్‌ను ఇప్పటికీ ఇష్టపడతానని కరిష్మా పేర్కొన్నారు. తాను ప్రత్యేకంగా ట్రెండ్స్‌ను ఫాలో కానప్పటికీ 90లలో ఇష్టపడి వేసుకున్న డార్క్ బ్రౌన్ లిప్‌స్టిక్ ట్రెండ్‌ను నేటికీ ఎంతో ఇష్టంగా ఉపయోగిస్తానని తెలిపారు. తన పాత చిత్రాలలోని లుక్స్‌ను నేటి తరానికి చెందిన ప్రేక్షకులు రీక్రియేట్ చేస్తుండడం.. తన పాటలకు డ్యాన్స్ చేస్తుండడం చూస్తుంటే ఎంతో సంతోషంగా.. గౌరవంగా అనిపిస్తుందని కృతజ్ఞతలు తెలిపారు.
ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్ని ట్రెండ్స్ వచ్చినా? దైనందిన జీవితంలో మాత్రం క్లాసిక్ స్టైల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని కరిష్మా చెప్పారు. ఎల్లప్పుడూ సౌకర్యవంతంగా ఉండే క్లాసిక్ బ్లూ జీన్స్ లేదా సింపుల్ వైట్ సల్వార్ కమీజ్ తన వార్డ్‌రోబ్‌లో ఎప్పటికీ ఉండాల్సిన కచ్చితమైన ఎసెన్షియల్స్ అని పేర్కొన్నారు. సినిమాల విషయానికి వస్తే, కరిష్మా కపూర్ చివరిగా 2024లో వచ్చిన `మర్డర్ ముబారక్` అనే మిస్టరీ థ్రిల్లర్ చిత్రంలో కనిపించి ప్రేక్షకులను అలరించారు.
















































