అనిల్ కపూర్ ఇంట్లో కరవా చౌత్ వేడుకలు!
Anil Kapoor house decorated on the occasion of Karva Chauth
అనిల్ కపూర్, సునీత కపూర్ నివాసంలో జరిగిన కరవా చౌత్ వేడుకల్లో బాలీవుడ్ ప్రముఖులంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలకు సంబంధించిన తారల రాకతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన నటీమణులు, సెలబ్రిటీల లుక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ వేడుకల్లో ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఈసారి ఆమె భర్త షారుఖ్ ఖాన్ లేకుండా ఒంటరిగా వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుక కోసం ఆమె సిల్వర్-గ్రే రంగు ఎంబ్రాయిడరీ చేసిన సంప్రదాయ దుస్తులను ధరించి ఫోటోగ్రాఫర్లకు నవ్వుతూ పోజులిచ్చారు.
ఇంకా శిల్పా శెట్టి, మీరా రాజ్‌పుత్, మహీప్ కపూర్, భావనా పాండే, నీలం కొఠారి, నటాషా దలాల్‌తో పాటు పలువురు ప్రముఖ బాలీవుడ్ తారలు .. వారి సతీమణులు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. అలాగే ఈ కార్యక్రమానికి ఫరా ఖాన్, జావెద్ అక్తర్ వంటి ప్రముఖులు కూడా హాజరై సందడి చేశారు.















































