రామాయణ ప్రీమియర్: యశ్ పేరు మోగిపోతుంది!
Ramayana: Yash was magnetic. Yash as Ravana is the standout
రామాయణ చిత్రం నవంబర్ 6 దివాళీ స్పెషల్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. రామాయణ టీమ్ సినిమాని తెరకెక్కించడానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టిందో, అంతకుమించి ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం యుఎస్ లో రామాయణ ప్రీమియర్స్ మొదలైపోయాయి. విడుదలకు పది రోజులు ముందే ప్రీమియర్స్ అంటే మేకర్స్ లో ఎంత నమ్మకం ఉందొ అర్థమవుతుంది.
యుఎస్ ప్రీమియర్స్ పూర్తి కావడంతో ఆడియన్స్ రామాయణ చిత్రాన్ని వీక్షించడమే కాదు. సినిమాపై తమ రివ్యూస్ ని షేర్ చేస్తున్నారు. అందులో రామాయణ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్, మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి. అయితే రామాయణంలో రావణ్ గా కన్నడ హీరో యశ్ పెరఫార్మెన్స్, ఆయన లుక్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తుంది.
రణబీర్ రాముడిగా, సీతగా సాయి పల్లవి కన్నా ఎక్కువగా అందరూ యశ్ రావణ్ పాత్ర గురించే మాట్లాడుతున్నారు. టాక్సిక్ తో డిజప్పాయింట్ చేసిన యష్ రావణ్ తో 100 కి 200 మార్కులు కొట్టేశారంటూ ఆయన్ని తెగ పొగుడుతున్నారు. యశ్ ఫ్యాన్స్ అయితే రావణ్ గా యశ్ ని చూసి తెగ ఇంప్రెస్స్ అవుతూ పోస్ట్ లు పెడుతున్నారు. మరి ఈ రామాయణ చిత్రంలో రణబీర్, సాయి పల్లవి కన్నా ఎక్కువగా యశ్ కె మంచి మార్కులు పడుతున్నాయి
















































