ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ అదే!

NTR - Nelson Dilip Kumar combo soonNTR - Nelson Dilip Kumar combo soon


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిన్న గురువారమే డ్రాగన్ సెట్ లోకి వెళ్లారు. గత రెండు నెలలుగా ఎన్టీఆర్ భుజానికి తగిలిన గాయంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ ప్రకటించారు. అయితే ఈమధ్యన త్రివిక్రమ్ తెరకెక్కించిన ఆదర్శ కుటుంబం పై ప్రస్తుతం ట్రేడ్ లో ఉన్న బజ్ చూశాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది.

తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ తో కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన జైలర్ 2 బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో చూసి ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో కన్నా ముందు నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా చెయ్యాలని ఎన్టీఆర్ ని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు. గతంలోనే ఎన్టీఆర్ తో నెల్సన్ సినిమా ఉంటుంది అనే ప్రచారం జరిగింది.

కానీ ఎన్టీఆర్ తొందర పడలేదు. ఇప్పుడు జైలర్ 2 విడుదలయ్యాక ఎన్టీఆర్ తో నెల్సన్ దిలీప్ కుమార్ తో ఎన్టీఆర్ కమర్షియల్ ఫార్ములాతో పాన్ ఇండియా మూవీ చేస్తే బావుంటుంది, త్రివిక్రమ్ తో తర్వాత చెయ్యొచ్చు అనేది ఫ్యాన్స్ కోరిక. మరి ఎన్టీఆర్ ఈ దిశగా ఆలోచిస్తారేమో చూడాలి. 
 

NTR - Nelson Dilip Kumar