ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Hrithik Roshan's Whopping Remuneration for Jailer 2

జైలర్ 2: హృతిక్ కళ్ళు చెదిరే పారితోషికం

Hrithik Roshan's Whopping Remuneration for Jailer 2Hrithik Roshan's Whopping Remuneration for Jailer 2


నిన్న గురువారం విడుదలైన సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ 2 కి బ్లాక్ బస్టర్ టాక్ పడిపోయింది. జైలర్ కి సీక్వెల్ గా తెరకెక్కిన జైలర్ 2 ని కూడా ఆడియన్స్ జైలర్ కన్నా మించి ఆదరిస్తున్నారు. జైలర్ 2కి తెలుగులో ఎలాంటి అంచానాలు లేవు, అయినా సినిమాకి మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ క్యామియోస్ అలాగే బాలీవుడ్ యాక్టర్ హృతిక్ రోషన్ గెస్ట్ అప్పీరియన్స్ అన్ని జైలర్ 2 బ్లాక్ బస్టర్ లో భాగమయ్యాయి.

అయితే ఈ చిత్రంలో హృతిక్ రోషన్ ను దర్శకుడు నెల్సన్ దిలీప్ సరిగ్గా వాడుకోలేదు, ఆయన పాత్ర నిడివి జస్ట్ వన్ మినిట్ కన్నా తక్కువే అంటున్నారు. అయితే జైలర్ లో ఆ చిన్న పాత్ర చేసినందుకు గాను ఆయనకు జైలర్ 2 మేకర్స్ ఏకంగా రూ. 25 కోట్ల పారితోషికం ఇచ్చినట్టుగా సమాచారం.

చాలా తక్కువ నిడివి, పరిమిత స్క్రీన్ స్పేస్ ఉన్న హృతిక్ రోషన్ కు ఆ రేంజ్ పారితోషికం అంటే మాములు విషయం కాదు. జైలర్ 2 కి సూపర్ స్టార్ రజినీకాంత్ రూ. 180 కోట్ల పారితోషికం మాట్లాడుకోగా.. అందులో రూ.110 కోట్లు ముందే తీసుకుని, మిగిలిన మొత్తం లాభాల్లో వాటాగా తీసుకోబోతున్నారట. మరి జైలర్ 2 టాక్ చూస్తే సూపర్ స్టార్ కి బాగానే గిట్టుబాటు అయ్యేలా ఉంది. 

Hrithik Roshan is said to have received a whopping Rs 25 crores remuneration for Jailer 2