ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: Vamsi and Trigun shed tears

బిగ్ బాస్ 10: కన్నీళ్లు పెట్టుకున్నవంశీ - త్రిగుణ్‌

Bigg Boss 10: Vamsi and Trigun shed tearsBigg Boss 10: Vamsi and Trigun shed tears


బిగ్ బాస్ సీజన్ 10 లో ఫ్రెండ్స్ గా కనిపించే వంశీ - త్రిగుణ్‌ లు కన్నీళ్లు పెట్టుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం వైల్డ్ ఫైర్స్, ఇంకా హౌస్ మేట్స్ మధ్యన జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్ లో శివ్ ఇంకా వంశీ ఓ టాస్క్ లో పోటీ పడగా.. వంశీ ఆ టాస్క్ చివరిలో బౌల్, ప్లేట్ పట్టుకుని టేబుల్ పై పెట్టబోయే క్రమంలో శివ్ ఎటాక్ చేసి ప్లేట్ తీసుకుని టేబుల్ పై పెట్టేసాడు.

ఆతర్వాత సంచాలక్ త్రిగుణ్‌ ప్లేట్, బౌల్ ఒకేసారి టేబుల్ పై పెట్టాలి అనగానే శివ్ వంశీ చేతిలో ఉన్న బౌల్ లాక్కుని బౌల్, ప్లేట్ కలిపి టేబుల్ పై పెట్టేసి గంటకొట్టేసాడు. చాలామంది అది అన్ ఫెయిర్ అన్నప్పటికీ.. శివ్ అది నా స్ట్రాటజీ అన్నాడు. దానితో వంశి చిన్న మిస్టేక్ వల్ల ఓడిపోయాను అని చెంప మీద కొట్టేసుకున్నాడు.

త్రిగుణ్‌, శివ్ ఆపినా ఆగలేదు. ఆతర్వాత వంశీ కన్నీళ్లు పెట్టుకున్నాడు, వంశీ ఏడవడం చూసి త్రిగుణ్‌ ఎమోషన్ అయ్యాడు. వంశీ, త్రిగుణ్‌ హాగ్ చేసుకుని ఏడుస్తున్న ప్రోమో వైరల్ అవుతుంది. 

Bigg Boss Telugu 10