వారణాసి: జస్ట్ 20 డేస్

Varanasi Movie Shooting UpdateVaranasi Movie Shooting Update


ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ ఇండియా ఫిలిం వారణాసి. ఈ చిత్రం వచ్చే ఏడాది అంటే 2027 ఏప్రిల్ టార్గెట్ గా తెరకెక్కుతుంది. రాజమౌళి అలాగే మహేష్, హీరోయిన్ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ లు వారణాసి షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు.

మరో 20 రోజుల పాటు మహేష్ బాబు వారణాసి షూటింగ్ లో పాల్గొంటే షూటింగ్ ఓ కొలిక్కి వస్తుంది అని, ఓ సాంగ్, అలాగే కొన్ని సీన్స్ మాత్రమే వారణాసి కి బ్యాలెన్స్ ఉన్నాయని, ఇక పోస్ట్ ప్రొడక్షన్ మొదలు కావడమే లేట్ అని తెలుస్తుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలు వారణాసి పోస్ట్ ప్రొడక్షన్ కి కేటాయిస్తారట.

మార్చ్ మొత్తం వారణాసి ని హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రమోషన్స్ తో ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చెయ్యడానికి రాజమౌళి అండ్ టీమ్ ప్లాన్ చేస్తుందట. మరి ఈ నెలాఖరుకల్లా వారణాసి షూటింగ్ ఫినిష్ అయితే ఆతర్వాత పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లోకి వారణాసి ఎంటర్ అయినట్లే. 
 

Varanasi Movie Update