మరోసారి హృతిక్ vs కంగనా
Kangana vs Hrithik
బాలీవుడ్ లో మాజీ ప్రేమికులైన హృతిక్ రోషన్, కంగనా రనౌత్ లు సోషల్ మీడియాలో ఇండైరెక్ట్ గా గొడవపడుతూ ఉంటారు. కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న హృతిక్, కంగనా లు మరోసారి సోషల్ మీడియా వేదికగా హైలెట్ అవుతున్నారు. కారణం హృతిక్ రోషన్ పోస్ట్ కు కంగనా ఘాటుగా స్పందించడమే.
ఈమధ్యన కంగనా సిజేపీ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్న తరుణంలో ఇన్‌ఫ్లూయెన్సర్ ఫ్రెడ్డీ బర్డీ ప్రపంచం హృతిక్ రోషన్‌కు క్షమాపణ చెప్పాలి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా దానికి హృతిక్ రోషన్ రియాక్ట్ అవుతూ.. నిజాలు బయటకు వచ్చిన తర్వాతే ఎవరి అభిప్రాయం అయినా చెప్పాలి. ఒకరు నచ్చలేదనే కారణంతో మరొకరికి మద్దతు ఇవ్వడం సరైంది కాదు. అదే న్యాయం. కానీ ఇప్పుడు వాటిని ఎవరు పట్టించుకుంటున్నారు అంటూ పోస్ట్ చేసారు. అవి కంగనాను ఉద్దేశించే హృతిక్ ఇలా రియాక్ట్ అయ్యారంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
అయితే కంగనా హృతిక్ పోస్ట్ కి డైరెక్ట్ గా రియాక్ట్ అయ్యింది. డియర్ హృతిక్.. నువ్వు నీకు సరైన జీవిత భాగస్వామి సబా ఆజాద్‌ను ఎంచుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. మీరు ఇద్దరూ కలిసి చాలా బాగుంటారు. మీరు ఇప్పుడు ఒక కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అలాంటి సమయంలో ఒక మహిళను ఇలా ఎగతాళి చేయడం నీకు తగదు.
నీ పేరు పెట్టుకుని నన్ను ట్రోల్ చేసున్న వారిని నువ్వే ఆపాలి. కానీ నువ్వు అలాంటిది చెయ్యకుండా ఈ వివాదానికి ఆజ్యం పోస్తున్నావు అంటూ కంగనా రనౌత్ హృతిక్ రోషన్ పై ఫైర్ అవుతూ పోస్ట్ పెట్టింది.








































