కియారా బర్త్ డే కి టాక్సిక్ ట్రీట్

A Toxic treat for Kiara's birthday.A Toxic treat for Kiara's birthday.


బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ కియారా అద్వానీ బర్త్ డే నేడు. జులై 31 న కియారా బర్త్ డే కి అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. కియారా బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాని ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఈ జంట కు ఓ పాప. పెళ్లి తర్వాత కూడా కియారా అద్వానీ కెరీర్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది.

సౌత్ లో అమ్మడు నటించిన పాన్ ఇండియా ఫిలిం టాక్సిక్ ఆగస్టు 26 న విడుదలకు రెడీ అవుతుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ బోల్డ్ గా రెచ్చిపోయింది. హీరో యశ్ తో కలిసి కియారా రెచ్చిపోయి రొమాన్స్ చేసింది. ఒక పెళ్ళైన హీరోయిన్ ఈ రేంజ్ రొమాన్స్ అంటూ ఆశ్చర్యపోయేలా ఆమె ఆ సాంగ్ లో కనిపించింది.

ఇక కియారా అద్వానీ బర్త్ డే కి టాక్సిక్ నుంచి అదిరిపోయే పోస్టర్ వదులుతూ కియారా కు టాక్సిక్ టీమ్ బర్త్ డే విషెస్ తెలిపింది. రెడ్ కాస్ట్యూమ్ లో కత్తిలాంటి లుక్ లో కియారా లేటెస్ట్ టాక్సిక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  
 

Team Toxic wishes Kiara Advani aka Nadia a very happy birthday