అక్కినేని కోడలు అద్దరగొట్టేసింది
Sobhita Dhulipala was the showstopper
అక్కినేని నాగార్జున పెద్ద కోడలు, నాగ చైతన్య వైఫ్ శోభిత దూళిపాళ్ల తాజాగా ఇండియా కూటుర్ వీక్ (ICW) 2026 గ్రాండ్ ఫినాలేలో అదిరిపోయే ర్యాంప్ వాక్ చేసింది. అది కూడా చూపు తిప్పుకోలేని కాస్ట్యూమ్ తో.
ప్యారిస్‌లో మెప్పించిన Devi: The Eternal Muse కలెక్షన్‌ను మన దేశీయ ర్యాంప్ పై ప్రదర్శిస్తూ, ర్యాంప్‌పైనే లైవ్‌లో ఒక దేవి రూపంలోకి మారడం అక్కడున్న అందరినీ ఆకట్టుకుంది. సౌత్ ఇండియా టెంపుల్ శిల్పాల ఆధ్యాత్మికతను, భారతీయ కళాకారుల చేతివృత్తి నైపుణ్యాన్ని ఈ ప్రదర్శన అత్యంత నాటకీయంగా చాటిచెప్పింది.
ఆ ర్యాంప్ వాక్ చూస్తూ ప్రేక్షకులు ఆశ్చర్యంతో వీక్షిస్తుండగా శోభితా అలా క్రమంగా దేవీ రూపంలోకి మారిన తీరు అందరిని మైమరపించింది. ఈ ర్యాంప్ వాక్ కేవలం డిజైనర్ దుస్తులను ప్రదర్శించడానికే కాకుండా.. ఫ్యాషన్, అభినయం ద్వారా భారతదేశపు కళాత్మక వారసత్వాన్ని కొనసాగించారని చెప్పొచ్చు.
ప్రస్తుతం శోభిత దూళిపాళ్ల స్టైలిష్ ర్యాంప్ వాక్ మాత్రం ఆమె లుక్ చూసి అభిమానులే కాదు ఇండియన్స్ అందరూ ఫిదా అవుతున్నారు.







































