ఫైనల్లీ థియేటర్స్ లోకి జన నాయగన్
All Set For Jana Nayagan Release
కోలీవుడ్ స్టార్ హీరో తమిళనాడు సీఎం విజయ్ నటించిన జన నాయగన్ ఫైనల్లీ థియేటర్స్ లోకి రాబోతుంది. జనవరి 9 న వాయిదా పడిన జన నాయగన్ చిత్రం ఇప్పటివరకు సెన్సార్ చిక్కులు ఎదుర్కుంటూ విడుదలకు నోచుకోలేదు. ఫైనల్ గా ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు A సర్టిఫికెట్ జారీ చేశారు.
దానితో జన నాయగన్ థియేటర్స్ రాక అనివార్యమైంది. ఇంకా స్పష్టంగా తేదీపై జన నాయగన్ నిర్మాతలు ప్రకటన జారీ చెయ్యలేదు కానీ.. ఈ నెల 24 న జన నాయగన్ రిలీజ్ అంటూ ఆ సినిమా డిస్ట్రిబ్యూర్స్ కు మెసేజ్ వెళ్లినట్లుగా తెలుస్తుంది. ఆ విషయం జన నాయగన్ డిస్ట్రిబ్యూటర్స్ కన్ ఫర్మ్ చేసారు.
సో ఫైనల్ గా జన నాయగన్ థియేటర్ రిలీజ్ కి లైన్ క్లియర్ అయింది. మరి విజయ్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్. గత ఆరు నెలలుగా వారు జన నాయకుడు కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఇప్పటికి అన్ని అడ్డంకులు దాటుకుని జన నాయకుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.







































