జన నాయగన్ పై మళ్లీ ఊరించిన ప్రియమణి!
Priyamani gives major update on Jana Nayagan release
దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన `జన నాయగన్` విడుదలపై ఇంకా క్లారిటీ రాని సంగతి తెలిసిందే. విజయ్ ఢిల్లీ వెళ్లి చక్రం తిప్పినా పనవ్వలేదు. దానికి సంబంధించిన అప్ డేట్ కూడా ఏదీ బయటకు రాలేదు. ఈనేపథ్యంలో తాజాగా రిలీజ్ పై హాట్ బ్యూటీ ప్రియమణి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సినిమాపై ప్రేక్షకులలో ఉన్న భారీ అంచనాలను అందుకునేందుకు చిత్ర బృందం తీవ్రంగా శ్రమిస్తోందన్నారు.
వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని.. సరైన సమయం వచ్చినప్పుడు అధికారిక విడుదల తేదీని వెల్లడిస్తామని తెలిపారు. అలాగే విజయ్ గురించి అమ్మడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ను ఆమె ఒక బోర్న్ లీడర్ గా కొనియాడారు. ఆయన పని పట్ల చూపే నిబద్ధత, తోటి నటులను , సాంకేతిక నిపుణులను ప్రోత్సహించే తీరు, సెట్స్‌లో ప్రవర్తించే విధానం తనను ఎంతో ప్రభావితం చేశాయని వెల్లడించారు.
విజయ్‌తో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవంగా అభిప్రాయపడ్డారు. `జన నాయగన్` సినిమా ఖచ్చితంగా అభిమానులను అలరిస్తుందన్నారు. కథాంశం , విజయ్ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ప్రియమణి ధీమా వ్యక్తం చేశారు. షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులలో కూడా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నామని పేర్కొన్నారు. గతంలోనూ విజయ్ తో కలిసి ప్రియమణి కొన్ని సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.







































