అల్లు అర్జున్ కి బిగ్ రిలీఫ్
Allu Arjun gets big relief in stampede case
పుష్ప 2 ప్రీమియర్స్ రోజు సంధ్య థియేటర్స్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో A 11 ముద్దాయిగా ఉన్న అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టు వ్యక్తిగతంగా విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చింది. దానికి అల్లు అర్జున్ తను ముంబై లో షూటింగ్ పనుల్లో బిజీగా వున్నాను, కోర్టుకి వ్యక్తిగతంగా రావడానికి కుదరదు వర్చువల్ గా హాజరవుతానని తన లాయర్ తో పిటిషన్ వేయించారు.
అల్లు అర్జున్ వర్చువల్ గా కోర్టు కు అటెండ్ అవ్వడానికి నాంపల్లి కోర్టు ఈరోజు విచారణలో భాగంగా అనుమతి ఇస్తుందా, లేదో అనేది ఉత్కంఠగా మారింది. ఈరోజు విచారణలో భాగంగా నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు వర్చువల్ గా అటెండ్ అవ్వడానికి అనుమతినిచ్చింది. ఇక ఈ కేసులో నిందితుల కొంతమంది వ్యక్తిగత కారణాలతో విచారణకు హాజరు కాకపోవడంతో తదుపరి విచారణ 29 కి వాయిదా వేసింది.
ఈ కేసులో 23 మంది నిందితులకు 500 పేజీల ఛార్జ్ షీట్ కాపీలను అందించిన పీపీ, అల్లు అర్జున్ ముంబై షూటింగ్ లో ఉండడంతో ఆయనకు మాత్రం వర్చువల్ గా కోర్టు విచారణకు హాజరయ్యేందుకు న్యాయ స్థానం అనుమతిచ్చింది. దానితో అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ దొరికినట్లే.







































