ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bhagyashri Borse speech at Lenin event

మనసులను మెలిపెట్టేసిన భాగ్యశ్రీ

Bhagyashri Borse speech at Lenin event

 

లెనిన్ చిత్రం అఖిల్ కి మాత్రమే కాదు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా కీలకమే. అమ్మడు టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి ఇప్పటివరకు హిట్ కొట్టలేదు. చేసింది మూడు సినిమాలే. అయినా భాగ్యశ్రీ బోర్సే కి సక్సెస్ దొరకలేదు. కాబట్టి లెనిన్ హిట్ ఆమెకు కీలకం.

తాజాగా లేని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగ్యశ్రీ బోర్సే అందంగా చీరకట్టులో కనిపించడమే కాదు అభిమానులను మనసులు మెలిపెట్టేసేలా తెలుగులో మాట్లాడింది. లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గత రాత్రి తిరుపతిలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో భాగ్యశ్రీ తెలుగు స్పీచ్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

లెనిన్ లో నేను భారతి అనే పాత్రను పోషించాను. ఇలాంటి గొప్ప పాత్రను నాకు ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. నా కెరీర్‌లో భారతి అనే పాత్ర నిలిచిపోతుంది. నాగార్జున గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నాను. ఈ మూవీ కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డారు. ఓ టీంగా పని చేద్దామని అఖిల్ ఎంతో సపోర్ట్ చేశారు.. అంటూ భాగ్యశ్రీ బోర్సే అభిమానుల మనసులను మెలిపెట్టేసింది. 

Bhagyashri Borse Speech at Lenin Grand Pre-Release Event