లెనిన్ ట్రైలర్ - యుద్ధం కూడా ప్రశాంతంగా జరగాలా

Lenin Trailer Review


అక్కినేని ప్రిన్స్ అఖిల్ నటిస్తున్న లెనిన్ చిత్రం మరో పది రోజుల్లో విడుదల కాబోతుంది. అఖిల్ సరసన క్యూట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న ఈ చిత్రాన్ని మురళి కిషోర్ అబ్భురి తెరకెక్కిస్తున్నారు. తాజాగా లెనిన్ ట్రైలర్ ని వైజాగ్ లో అభిమానుల నడుమ విడుదల చేశారు.

కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్ తో పవర్ ఫుల్ గా మొదలైన లెనిన్ ట్రైలర్ లో ఇది మహాభారతం, చిత్తూరు జిల్లాలో 18 రోజుల పాటు ద్రౌపదమ్మను కొలుస్తారు. ఈ పవిత్ర నెలకున్న ఒకే ఒక్క నిబంధన, ఒక్క రక్తపు బొట్టు కూడా నెలకు చిందకూడదు అంటూ అఖిల్ రక్తపుబొట్టు హీరోయిన్ భారతి అదేనండి భాగ్యశ్రీ నుదుటున పడేలా చేస్తూ ట్రైలర్ మొదలైంది.

మామ కూతురు భారతితో అఖిల్ ప్రేమాయణం, రాజకీయాల్లో కక్షలు కార్పణ్యాలు.. మహాభారత యుద్ధంలో కురుక్షేత్రం అంటూ లెనిన్ ట్రైలర్ కట్ ఉంది. క్యూట్ లవ్ స్టోరీలో రక్తపుటేరులు పారేలా చేసిన పెద్దలు. మీ కాళ్ళు పట్టుకుంటానురా.. భారతిని వదిలెయ్యండిరా అది నా ప్రాణం అంటూ అఖిల్ చెప్పిన డైలాగ్, కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడు కి ఏం చెప్పాడో తెలుసునా, యుద్ధం కూడా ప్రశాంతంగా సెయ్యాలని, ఏంది అట్నే చేద్దామా అని అఖిల్ సెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ లెనిన్ ట్రైలర్ లో హైలెట్ గా నిలిచాయి.

అఖిల్ భాషలో యాస, అఖిల్ లుక్స్ , థమన్ BGM, భాగ్యశ్రీ బోర్సె అందం, శివాజీ, సునీల్ ఇలా ప్రతి పాత్ర బలంగా కనిపిస్తుంది. మురళి కిషోర్ అబ్బూరి దర్హకత్వం, సినిమాటోగ్రఫీ,  ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని రిచ్ గా లెనిన్ ట్రైలర్ కు అమరాయి. 

Lenin Trailer Released