ప్రెగ్నెన్సీ తో జిమ్ లో సమంత
Samantha Ruth Prabhu spotted leaving the gym
టాప్ హీరోయిన్ సమంత ప్రెగ్నెంట్. ఈమధ్యనే ఆమె ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. మా ఇంటి బంగారం ప్రమోషన్స్ లో సమంత తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్నీ ప్రకటించింది. మా ఇంటి బంగారంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని నటిగా, నిర్మాతగా టాప్ లోకి వెళ్ళిపోయిన సమంత దానికి సీక్వెల్ అనౌన్స్ చేసారు.
ఇక పెళ్లి తర్వాత రాజ్ నిడిమోరు.. భార్య సమంత పక్కనే ఉంటున్నారు. మా ఇంటి బంగారం చిత్రానికి రాజ్ ప్రొడ్యూసర్ కం కథ అందించారు. ఇక ప్రమోషన్స్ లో సమంత పక్కనే రాజ్ కనిపించారు. భార్య ప్రెగ్నెంట్ అవడంతో ఆమెను చాలా కేరింగ్ గా చూసుకుంటున్నారు రాజ్.
రీసెంట్ గా వైజాగ్ లో మా ఇంటి బంగారం సక్సెస్ మీట్ అవ్వగానే వైజాగ్ నుంచి డైరెక్టర్ గా సమంత-రాజ్ లు ముంబై వెళ్లిపోయారు. ఈరోజు ముంబైలో సమంత జిమ్ కి వెళుతూ కనిపించింది. ప్రెగ్నెన్సీ తో సమంత జాగ్రత్తలు తీసుకుంటూ వర్కౌట్స్ చేస్తుంది. సమంత ముంబై లో జిమ్ కి వెళ్లొస్తున్న వీడియోస్ వైరల్ అవుతున్నాయి.







































