ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rashmika To Reunite With Allu Arjun For Raaka

రాకా లోకి ఎంటర్ అయిన రష్మిక

Rashmika To Reunite With Allu Arjun For Raaka


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలతో పాన్ ఇండియా మార్కెట్ లో శ్రీవల్లి గా తన మార్క్ చూపించిన రష్మిక మందన్న మరోసారి అల్లు అర్జున్ తో జత కట్టబోతుంది. పుష్ప తర్వాత కోలీవుడ్ దర్శకుడు అట్లీ తో పాన్ ఇండియా ఫిలిం రాకా చిత్రంలో నటిస్తున్న అల్లు అర్జున్ ఈ చిత్రంలో దీపికా పదుకొనే తో రొమాన్స్ చేస్తున్నారు.

దీపికా పదుకొనె మాత్రమే కాకుండా రాకా లో మరో నలుగురు హీరోయిన్స్ కూడా నటించబోతున్నారనే టాక్ ప్రచారంలో ఉంది. అందులో మృణాల్ ఠాకూర్, రష్మిక, జాన్వీ కపూర్ లు కనిపిస్తారని అంటున్నారు. ఇప్పటికే జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ లు రాకా లో తమ పార్ట్ షూటింగ్ పూర్తి చేసేసారు.

ఇక ఇప్పుడు రాకా లోకి నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎంటర్ అయినట్లుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ రాకా షూటింగ్ ప్రస్తుతం ముంబై లో జరుగుతుంది. మరి అల్లు అర్జున్ తో రష్మిక మరోసారి జతకడుతుంది. సో రాకా లో వీరి ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో అనేది చూడాలి.  

Allu Arjun and Rashmika Mandanna to kick off Mumbai