అఫీషియల్- అక్టోబర్ లో ఆదర్శ కుటుంబం
Official – Aadarsha Kutumbam in October
వెంకీ-త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న ఆదర్శకుటుంబం ఇంటి నెం 42 చిత్రం అక్టోబర్ 2 న విడుదల అంటూ సోషల్ మీడియాలో హడావిడి చెయ్యడమే కానీ మేకర్స్ నుంచి అఫీషియల్ ప్రకటన రాలేదు. అసలు ఆదర్శ కుటుంబం నుంచి వెంకీ లుక్ తప్ప మరో అప్ డేట్ కూడా లేదు.
రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ సైలెంట్ గా ఉండడాన్ని వెంకీ ఫ్యాన్స్ లో సహనం కలిగేలా చేసింది. ఈరోజు శనివారం సడన్ గా ఆదర్శ కుటంబం చిత్రం అక్టోబర్ 2 రిలీజ్ అంటూ ఫ్యామిలీ పోస్టర్ వేసి ప్రకటించారు. ఆ పోస్టర్ లో వెంకీ చాలా సాఫ్ట్ గా కూల్ గా ఫ్యామిలీ మ్యాన్ లా కనిపించగా శ్రీనిధి శెట్టి ఆయన భార్యగా కనిపిస్తుంది.
ఆదర్శ కుటుంబం పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కతుంది అనేది ఈ రిలీజ్ డేట్ పోస్టర్ తోనే క్లారిటీ ఇచ్చేసారు. సో అక్టోబర్ 2 గాంధీ జయంతికి ఆదర్శ కుటుంబం థియేటర్స్ లో సందడి చేస్తుందన్నమాట.
Aadarsha Kutumbam Release date finalised







































