మ్యారేజ్ పై ఓపెన్ అయిన త్రిష
Trisha opens up about marriage
నటి త్రిష 40 ఏళ్ళు వచ్చినా ఇంకా సింగిల్ స్టేటస్ నే మైంటైన్ చేస్తుంది. గతంలో ఓసారి త్రిష కు బిజినెస్ మ్యాన్ తో నిశ్చితార్థం కాగా దానిని త్రిష బ్రేక్ చేసుకుని నటనను కొనసాగిస్తుంది. ఇక ఈమధ్యన తమిళనాడు సీఎం విజయ్ తో క్లోజ్ గా మూవ్ అవుతూ ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో త్రిష పెళ్లి పై చేసిన కామెంట్స్ హాట్ హాట్ గా చక్కర్లు కొడుతున్నాయి. నేను ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ డివోర్స్ జోలికి వెళ్ళను.. లైఫ్ లాంగ్ కలిసి ఉండే వ్యక్తి కోసమే నా అన్వేషణ ఉంటుంది. నేను పెళ్లి విషయంలో ఇలా ఆలోచించడానికి కారణం నా ఫ్రెండ్స్. వాళ్లలో చాలామంది పెళ్లిళ్లు చేసుకుని విడాకుల వరకు వెళ్లి ప్రస్తుతం తీవ్రమైన మానసిక బాధను అనుభవిస్తున్నారు.
ఎవరో ఏదో అనుకుంటారు, సమాజం ఏం మాట్లాడుతుందో, వయసు అయిపోతుందనో హడావిడిగా పెళ్లి చేసుకుని జీవితాన్ని నరకం చేసుకోలేను. నాకు నచ్చినవాడు, నన్ను ఆర్షం చేసుకునేవాడు దొరికితే పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ నాకు తగ్గ వ్యక్తి దొరక్కపోయినా పర్లేదు.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవడానికైనా సిద్ధమే తప్ప, తప్పుడు నిర్ణయం తీసుకోను అంటూ త్రిష పెళ్లి పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







































