వారణాసి లో అది చూడలేమా..

Varanasi Antarctica schedule Varanasi Antarctica schedule


దర్శకుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ వారణాసి చిత్రం షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చారు. దానితో మన హీరోగారు ఫ్యామిలీ తో విదేశీ ట్రిప్ వేశారు. ఇక రాజమౌళి వారణాసి పై అంచనాలు పెంచే కామెంట్స్ చేస్తున్నారు.. ఇప్పటికే మేజర్ షెడ్యూల్స్ పూర్తయ్యాయి. అక్టోబర్ మిడిల్ కల్లా మిగతా వారణాసి షూటింగ్ ఫినిష్ అవుతుంది అని చెప్పారు.

అయితే వారణాసిలో అతి కీలకమైన కెన్యా షెడ్యూల్ ని టీమ్ ఎప్పుడో కంప్లీట్ చేసింది. మరో అతి కీలకమైన షెడ్యూల్ అంటార్కిటికాలో జరగాల్సి ఉంది. కానీ యుద్ధ పరిస్థితులతో వారణాసి అంటార్కిటికా షెడ్యూల్ వాయిదా పడుతూ వచ్చింది. ఇకపై అంటార్కిటికా షెడ్యూల్ ఉండకపోవచ్చు..

రాజమౌళి అంటార్కిటికాలో చెయ్యాల్సిన షూటింగ్ ఇక్కడే సెట్ వేసి కానిచ్చేస్తారేమో అంటున్నారు. మరి వారణాసిలో కీలకమైన అంటార్కిటికా షెడ్యూల్ మనం సినిమాలో చూడలేమా అంటూ మహేష్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. కానీ జక్కన్న విషయంలో మహేష్ ఫ్యాన్స్ అలాంటిఆలోచనే చెయ్యొద్దు అనేది రాజమౌళి ఫ్యాన్స్ సలహా.

Varanasi shooting update