నాటకీయ పరిణామాల మధ్య జబర్దస్త్ ఫైమా పెళ్లి
Faima tied the knot with longtime boyfriend Praveen Naik
ఈటివి జబర్దస్త్ లో ఫేమస్ అయ్యి, బిగ్ బాస్ లోకి వెళ్లి తన సత్తా చాటిన ఫైమా అందం లేకపోయినా, గ్లామర్ చూపించకపోయినా తన పెరఫార్మెన్స్ తోనూ అలాగే ఎనర్జిటిక్ కామెడీ, డాన్స్ లతో తన ప్రత్యేకత చూపించే ఫైమా జబర్దస్త్ లోనే పటాస్ ప్రవీణ్ ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకోబోతుంది అనే ప్రచారం జరిగింది.
కానీ పటాస్ ప్రవీణ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోగా ఫైమా కూడా ప్రవీణ్ నాయక్ అనే కుర్రాడిని ఇష్టపడుతున్నట్టుగా వారు ప్రేమించుకుంటున్నట్టుగా చెప్పింది. తాజాగా ఫైమా ప్రవీణ్ ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రవీణ్-ఫైమా లు సుదీర్ఘకాలం పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
అయితే కుటుంబ సభ్యులు మరియు పెద్దల నుండి వెరీ పెళ్ళికి వ్యతిరేఖత ఉండడంతో వీరిద్దరూ హైదరాబాద్‌లోని రిజిస్టార్ ఆఫీస్‌లో సింపుల్‌గా రిజిస్టర్ వివాహం చేసుకుని ఆ వీడియో ని ఫైమా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కొందరు తమను విడగొట్టడానికి ప్రయత్నించారని, కానీ తాము అనుకున్నట్లే ఒకటయ్యామని ఆ వీడియోలో ఫైమా, ప్రవీణ్ లు ఎమోషనల్ అయ్యారు.








































