పుత్రోత్సాహం అంటూ చిరు ఎమోషనల్ ట్వీట్
Megastar tweet emotionally about his son Ram Charan
మెగాస్టార్ చిరు నిన్న బుధవారం సాయంత్రం శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొని కొడుకు విజయాన్ని ఆస్వాదిస్తూ పొగిడెయ్యడమే కాదు కొడుకు చరణ్ తో తనెంత ఆనందంగా ఉంటానో అనే విషయాన్నీ చూపించారు. ఈరోజు ఉదయం చిరు పుత్రోత్సాహం అంటూ ఎమోషనల్ అవుతూ.. మరో ట్వీట్ చేసారు.
పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం.
ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అంటూ ప్రధాని మోడీ తో చరణ్ ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసారు.







































