స్టార్ హీరో స్ట్రాంగ్ లైన‌ప్ సెట్ చేస్తున్నాడే!

Suriya's Lineup Is Quite Interesting!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవ‌లే  `కరుప్పు`చిత్రంతో మంచి విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. ఈ సక్సెస్ జోష్‌తో తన మార్కెట్ విలువను మరింత పెంచుకునేలా రాబోయే ప్రాజెక్టులపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం సూర్య కెరీర్‌లో 46వ చిత్రం నుండి ప్రతిష్టాత్మక 50వ సినిమా వరకు ఒకదానికొకటి పొంతన లేని భిన్నమైన కథాంశాలతో.. అత్యంత ఆసక్తికరమైన లైనప్‌ను సెట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా టాలెంట్ ఉన్న విభిన్న దర్శకులతో క్రేజీ కాంబినేషన్లను లైన్‌లో పెడుతూ అటు తమిళంతో పాటు ఇటు తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమల్లోనూ తన పరిధిని విస్తరించుకోవడానికి బలమైన ప్రణాళికలు రచిస్తున్నారు.

సూర్య తదుపరి చిత్రాల్లో ముందుగా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న `విశ్వనాథ్ అండ్ సన్స్` విడుదలకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత మలయాళ బ్లాక్‌బస్టర్ `ఆవేశం` ఫేమ్ జీతూ మాధవన్ కాంబినేషన్‌లో ఓ చిత్రం, అలాగే  `జై భీమ్` వంటి క్లాసిక్‌ని అందించిన టి.జి. జ్ఞానవేల్‌తో మరో ప్రాజెక్ట్ చర్చల దశలో ఉన్నాయి. వీటికి తోడు దర్శకుడు హెచ్. వినోద్‌తో ఒక సినిమా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి.

సూర్య కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచే 50వ చిత్రాన్ని భారీ కమర్షియల్ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ హ్యాండిల్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. భిన్నమైన శైలి కలిగిన ఈ దర్శకులందరితో సూర్య చేయబోయే సినిమాలు గనుక బాక్సాఫీస్ వద్ద క్లిక్ అయితే ఆయన పాన్-ఇండియా మార్కెట్ రేంజ్ సరికొత్త శిఖరాలను తాకడం ఖాయంగా కనిపిస్తోంది.

Suriya Massive Lineup