పదేళ్ల విరామాన్ని ఆడియన్స్ ఒప్పుకుంటారా?

Vadde Naveen Transfer Trimurthulu


కోరుకున్న ప్రియుడు సినిమా చూసిన వాళ్ళెవరూ వడ్డే నవీన్ ని అంత త్వరగా మర్చిపోరు. స్టార్ హీరో రేంజ్ అందుకోకపోయినా.. వడ్డే నవీన్ మంచి సినిమాలు చేసారు. ఎందుకో ఏమిటో ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి కొన్నేళ్లు బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు దాదాపుగా పదేళ్ల తర్వాత ఆయన రీ ఎంట్రీ ఇస్తున్నారు.

వడ్డే నవీన్ లేటెస్ట్ చిత్రం ట్రాన్ఫర్ త్రిమూర్తులు రేపు శుక్రవారం కాబోతుంది. ఈ చిత్రంతో నవీన్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చాల కష్టపడ్డారు. వరస ప్రమోషన్స్, కనెక్ట్ అయ్యే కంటెంట్ తో వడ్డే నవీన్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి పదేళ్ల గ్యాప్ ని ఆడియన్స్ ఒప్పుకుంటారా, అందులోను హీరోగా ఆయన్ని చూస్తారా అనే డౌట్ చాలామందిలో ఉంది.

ఎప్పుడు ప్రేక్షకుల్లో ఉంటూ.. సోషల్ మీడియా లో హడావిడి చేసే స్టార్స్ కి మంచి సినిమా పడకపోతె ఫేడ్ అవుట్ అవుతున్న ఈ రోజుల్లో వడ్డే నవీన్ ఇన్నేళ్ళుగా కనీసం అన్న పాత్రలో లేదంటే మరె కీలక పాత్రలో కనిపించ లేదు. అలాంటిది ఆయన ఈరోజు హీరో అంటే జనాలు ఒప్పుకుంటారా, కంటెంట్ బావుంటే ట్రాన్ఫర్ త్రీమూర్తులు ఆడుతుంది, లేదంటే అందరికి తెలుసు ఏమవుతుందో అనేది.

Vadde Naveen is all set to return to the big screen with Transfer Trimurthulu