ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Venkatesh, Anil Ravipudi and Kalyan Ram's Film Officially Launched

నిన్న శర్వా - నేడు వెంకీ-NKR

Venkatesh, Anil Ravipudi and Kalyan Ram's Film Officially Launched


సంక్రాంతి 2027 కి ఎన్ని సినిమాలు విడుదల బరిలో ఉంటాయో తెలియదు కానీ.. రెండు సినిమాలు మాత్రం టార్గెట్ ఫిక్స్ చేసి మరీ బరిలోకి దిగుతున్నాయి. అందులో ఈ ఏడాది సంక్రాంతికి నారి నారి నడుమ మురారి చిత్రంతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన శర్వానంద్  సంక్రాంతిని టార్గెట్ చేస్తూ నిన్న బుధవారం శ్రీను వైట్ల దర్శకత్వంలో మూవీ పూజ కార్యక్రమాలతో బిగిన్ చేసారు.

శర్వా-శ్రీను వైట్ల కాంబో పూజ కార్యక్రమాలతో మొదలై త్వరలోనే రెగ్యులర్ షూట్ కి వెళ్లడమే కాదు ఆరు నెలల్లో అంటే జనవరి 2027 సంక్రాంతికి రిలీజ్ అంటూ ప్రకటించారు. ఇక ఈరోజు గురువారం సంక్రాంతి విన్నర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్-కళ్యాణ్ రామ్ ల చిత్రం పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యింది.

ఈ నెల 24 నుంచి రెగ్యులర్ షూట్ కి వెళ్ళబోయే అనిల్-వెంకీ-కళ్యాణ్ రామ్ ల కాంబో వచ్చే ఏడాది అంటే 2027 సంక్రాంతి కి విడుదల అంటూ టార్గెట్ ఫిక్స్ చేసి మరీ దిగుతున్నారు. ఈ చిత్రంలో వెంకీ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తున్నారు. ఈ భామలిద్దరూ ఈరోజు అనిల్-వెంకీ-NKR పూజ కార్యక్రమాల్లో మెరిశారు.

VenkyAnil5 - NKRAR2 is an upcoming film Starring