ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Samantha and Raj Nidimoru visited the Tirumala Tirupati

సమంత సెంటిమెంట్ కంటిన్యూ

Samantha and Raj Nidimoru visited the Tirumala Tirupati


సమంత ఎప్పటినుంచో తాను నటించిన సినిమాలు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి అంటే చాలు తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకుని తన సినిమా బాగా ఆడాలని మొక్కుకుని వస్తుంది. తన సినిమాని ప్రేక్షకులు ఆదరించాలని వెంకేశ్వరుడు ని మొక్కుకుంటుంది. అది కూడా ఎంతో భక్తి శ్రద్దలతో శ్రీవారి ఏడు కొండలు కాలినడకన చేరుకొని శ్రీవారి దర్శనం చేసుకుంటుంది.

అదే సెంటిమెంట్ ని మా ఇంటి బంగారం కి కూడా సమంత కంటిన్యూ చేసింది. తన టీమ్ దర్శకురాలు నందిని రెడ్డి, భర్త రాజ్ నిడిమోరు, శ్రీముఖితో కలిసి సమంత ఈరోజు విఐపి బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకుంది. ప్రస్తుతం సమంత తిరుమల తిరుపతి వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక్కడ హైదరాబాద్ లో గబా గబా మా ఇంటి బంగారం ప్రమోషన్స్ ని ముగించేసి సినిమా విడుదలకు ఒక రోజు ముందే సమంత తన టీమ్ తో కలిసి తిరుమలలో వాలిపోయింది.

Maa Inti Bangaram movie team Visited Tirumala