దసరాకు విడుదల సాధ్యమేనా?
Tollywood Senior Heroes Focused on Dasara
ఇప్పటివరకు ఫస్ట్ లుక్ వదల్లేదు, ఫస్ట్ లుక్ వచ్చినా టైటిల్ ఇవ్వలేదు, టైటిల్ ఇచ్చినా మరే అప్ డేట్ ఇవ్వని సినిమాలు దసరా విడుదల సాద్యమేనా.. దసరాకు ఇంకా మూడున్నర నెలలు మాత్రమే సమయం ఉంది. ఇంకా రిలీజ్ డేట్స్ లాక్ చెయ్యని సినిమాలు దసరా రేస్ లోకి వస్తాయంటే నమ్మబుద్ది కావట్లేదు.
ఈ దసరా కు నలుగురు సీనియర్ హీరోలు పోటీ పడే ఛాన్స్ ఉంది అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో రీసెంట్ గా జూన్ 10 న బాలయ్య NBK 111 బర్త్ డే రోజు వదిలిన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. ఇప్పుడు ఈ చిత్రం దసరా బరిలో దిగే ఛాన్స్ ఉంది అంటున్నారు.
ఇంకా టైటిల్ వదలని ఈ చిత్రానికి అలాగే షూటింగ్ ఫినిష్ కూడా అవ్వలేదు. మరి దసరా కి విడుదల సాధ్యమయ్యేనా, వెంకీ-త్రివిక్రమ్ ల ఆదర్శ కుటుంబం.. ఇది టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ వచ్చింది కానీ.. ఇప్పుడు వరకు షూటింగ్ అప్ డేట్ లేదు. మరి అది కూడా దసరా కి వచ్చే అవకాశం కనిపించడం లేదు.
ఇక మూడో హీరో కింగ్ నాగార్జున. ఆయన తన 100 వ సినిమాని సైలెంట్ గా మొదలు పెట్టారు కానీ ఆ చిత్రం నుంచి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ కానీ, టైటిల్ కానీ ఇలా ఏ అప్ డేట్ రాలేదు. మరో మూడున్నర నెలల్లో ఈ సినిమా ఎలా విడుదలవుతుంది. ఇక మెగాస్టార్ చిరు విశ్వంభర కూడా దసరా బరిలో నిలవబోతుంది అని తెలుస్తుంది.
చిరు విశ్వంభర సీజీ వర్క్ పూర్తయితే అది మాత్రమే దసరా కి విడుదలయ్యే ఛాన్స్ ఉంది కానీ.. మిగతా ముగ్గురు సినిమాలు ఏవి ఈ ఏడాది దసరా కు వచ్చే ఛాన్స్ అయితే కనిపించడం లేదు.






































