విడాకుల తర్వాత పనిలో పడిన హీరోయిన్
Hansika on learning Hyderabad dialect for Gully
కెరీర్ లో కాస్త సినిమా అవకాశాలు తగ్గతున్నాయనగానే తన ఫ్రెండ్ మాజీ భర్త సోహెల్ ఖతురియాను ప్రేమించి అంగరంగ వైభవంగా వివాహమాడిన పాల బుగ్గల హన్సిక.. ఆతర్వాత రెండేళ్లకే భర్త సోహెల్ ఖతురియాతో విడిపోయేందుకు ముంబై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసు వేసింది. ఆ కేసు 2026 లో విచారణకు వచ్చి కోర్టు హన్సికకు విడాకులిచ్చేసింది.
విడాకుల తర్వాత విహార యాత్రలు చేసి కాస్త రిలాక్స్ అయిన హన్సిక తాజాగా పనిలో పడింది. మళ్లీ కెరీర్ లో బిజీ అయ్యేందుకు హన్సిక చేసిన ప్రయత్నాలు ఫలించి అమ్మడు కి వెబ్ సీరీస్ లో ఛాన్స్ వచ్చింది. గల్లీ అనే భారీ యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ద్వారా ఆమె పవర్ఫుల్ సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతోంది.
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ గల్లీ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన ఒక ఇంటెన్స్ షెడ్యూల్ షూటింగ్ రీసెంట్ గా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక చార్మినార్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఈ షెడ్యూల్లో జేడీ చక్రవర్తితో కలిసి హన్సిక కొన్ని కీలకమైన యాక్షన్, డ్రామా సీన్లలో పాల్గొంది. సో విడాకుల తర్వాత హన్సిక కొత్తగా ఇలా కొత్తగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నమాట.







































