ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Varanasi Budget Concerns Worry Rajamouli Team

వారణాసి ఓటీటీ డీల్.. ఇంకా వీడని సస్పెన్స్!

Varanasi Budget Concerns Worry Rajamouli Team

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి- సూపర్‌స్టార్ మహేష్  కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న గ్లోబల్ అడ్వెంచర్ చిత్రం `వారణాసి`పై ప్రపంచవ్యాప్తంగా అసాధారణమైన అంచనాలున్నాయి. 1400 కోట్ల భారీ బడ్జెట్‌తో  ప్రతిష్టాత్మక చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ పక్కా ప్రణాళికతో షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నారు.

అయితే సినిమా నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నా?  మూవీ డిజిటల్ హక్కుల వ్యాపారానికి సంబంధించిన  కీలకమైన అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోవడం  పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఓటీటీ డీల్‌పై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాతో పాటు సినీ సర్కిల్స్‌లో రకరకాల ఊహాగానాలు.. గందరగోళం కొనసాగుతున్నాయి.

ఇండస్ట్రీ టాక్ ప్రకారం ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ సంస్థ ఈ చిత్రం కోసం వందల కోట్ల భారీ ఆఫర్లను ప్రకటించినప్పటికీ, థియేట్రికల్ విండో (సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటీటీలోకి రావడానికి పట్టే సమయం) వ్యవధిపై ఇరువర్గాల మధ్య చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదని తెలుస్తోంది. రాజమౌళి సినిమాలకు థియేటర్లలో ఉండే సుదీర్ఘమైన డిమాండ్ దృష్ట్యా ఓటీటీ స్ట్రీమింగ్‌ను కనీసం 8 వారాల వరకు ఆలస్యంగా ప్రారంభించాలనేది మేకర్స్ ఆలోచనగా కనిపిస్తోంది.

బిజినెస్ పరంగా భారీ మొత్తాలు చేతులు మారే అవకాశం ఉన్న ఈ డీల్ ఇంకా అధికారికంగా లాక్ కాకపోవడంతో నెట్టింట కొన్ని ప్రతికూల ప్రచారాలు కూడా మొదలయ్యాయి. విడుదలకు ముందే సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న వారణాసి చిత్ర బృందం డిజిటల్ రైట్స్ సస్పెన్స్‌కు ఎప్పుడు స్వస్తి పలుకుతుందో చూడాలి.

Varanasi Looks Ready for a Record-Breaking Run