ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Mahesh Babu - Sandeep reddy Vanga was titled DEVIL

మహేష్-సందీప్ వంగ డెవిల్

Mahesh Babu - Sandeep reddy Vanga was titled DEVIL


అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత సందీప్ రెడ్డి వంగ సూపర్ స్టార్ మహేష్ ని కలిసి కథ వినిపించారని టాక్ ఉంది. మహేష్ ని సందీప్ రెడ్డి కలిశారు. ఇంకేంటి ప్రాజెక్ట్ ఓకే అయ్యింది అనుకున్నారు. కానీ వారి కాంబో పై అఫీషియల్ ప్రకటన లేదు. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో సందీప్ రెడ్డి వంగ ను మహేష్ తో మీరు యానిమల్ స్క్రిప్ట్ చెయ్యాలనుకున్నారా అని అడిగారు.

దానికి యానిమల్ కాదు డెవిల్. అది వేరే చేయాలనుకున్నాను. అంటే యానిమల్ లా అంతే వైలెంట్ గా మహెష్ ని చూపించాలనుకున్నారా అంటే కాదు అది వేరే అంతకు మించి, అది ఇంకా ఎక్కువనే ఉండింది.. అంటూ సందీప్ వంగ మహేష్ తో చెయ్యబోయే డెవిల్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఎండాకాలాన్ని సమ్మర్ వెకేషన్స్ రూపంలో ఎంజాయ్ చెయ్యకుండా వారణాసి షూటింగ్ కోసం సమయం వెచ్చించారు. దర్శకుడు రాజమౌళి వారణాసి షూటింగ్ ని జులై, ఆగస్టు కల్లా ఓ కొలిక్కి తెచ్చేలా ప్లాన్ చేసారు. అందుకే మహేష్ ఎలాంటి బ్రేక్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారు.

మరోపక్క సందీప్ వంగ ప్రభాస్ తో ఎలాంటి సమ్మర్ వెకేషన్స్ తీసుకోకుండా స్పిరిట్ షూటింగ్ చేస్తున్నారు. మహేష్ వారణాసి, సందీప్ స్పిరిట్ రెండు వచ్చే ఏడాది మార్చ్, ఏప్రిల్ లో విడుదల కాబోతున్నాయి. ఆతర్వాత సూపర్ స్టార్ తో సందీప్ డెవిల్ సినిమా ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూడాలి. 

Mahesh Babu To Team Up With Sandeep Reddy Vanga