అక్కడ ఓకే ఇక్కడ క్లారిటీ ఏది
All Set For Peddi Premiers in AP
ఏపీలో పెద్ది ప్రీమియర్స్ అలాగే టికెట్ రేట్స్ హైక్ పై ఓ క్లారిటీ వచ్చేసింది. జూన్ 3 నైట్ నుంచే పెద్ది ప్రీమియర్స్ కి ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చేసింది. అలాగే టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. మరి అక్కడ ఓకే ఇక్కడ తెలంగాణాలో పరిస్థితి ఏమిటి. పెద్ది కి హైక్ ఉంటుందా..
తెలంగాణాలో టికెట్ రేట్ల పెంచడం కోసం, అలాగే ప్రీమియర్స్ కోసం నిర్మాతలు ప్రభుత్వాన్నిఅడుగుతున్నారు. అది చూసుకుని ఈ నెల 31 నుంచి లేదా జూన్ 1 నుంచి పెద్ది టికెట్స్ తెలంగాణాలో ఓపెన్ చేస్తారని తెలుస్తుంది. పెద్ది టికెట్ రేటు హైక్ పై తెలంగాణ ప్రభుత్వం నుంచి G.O రావాలి.
ఒకవేళ అది వచ్చినా రాకపోయినా ఈసారి రాజా సాబ్ ప్రీమియర్స్ లా పెద్ది కి అసల్యం కాకుండా చూసుకుంటున్నారు నిర్మాతలు. పెద్ది కి విడుదలకు ఒకరోజు ముందు అంటే జూన్ 3 నైట్ రెండు ప్రీమియర్స్ 7pm /10:30pm షోస్ కి తెలంగాణ ప్రభుత్వాన్ని పర్మిషన్ అడుగుతున్నారు నిర్మాతలు.







































