Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Biggest Challenge For Telugu Actresess

తెలుగ‌మ్మాయిల‌కు బిగ్గెస్ట్ ఛాలెంజ్?

Biggest Challenge For Telugu Actresess

ఇటీవ‌లి కాలంలో వెబ్ సిరీస్ లు న‌టీమ‌ణుల‌కు అంత‌ర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెడుతున్నాయి. ది ఆర్చీస్ లాంటి వెబ్ సిరీస్ తో షారూఖ్ ఖాన్ స‌హా ప‌లువురు సెల‌బ్రిటీ కిడ్స్ వెబ్ సిరీస్ ప్ర‌పంచంలో అడుగుపెట్ట‌డానికి కార‌ణ‌మిదే. వీటిని ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీక్షించేవాళ్లు ఎక్కువ‌గ‌నుక రీచ్ బావుంటుంది.

ఇది ఒక అంత‌ర్జాతీయ టెంప్లేట్. దీనిని అనుస‌రిస్తూ చాలా వెబ్ సిరీస్ లు భార‌తీయ చిత్రసీమ‌లో వ‌చ్చాయి. ఇప్పుడు `ఆఫ్ క్యాంప‌స్` పేరుతో యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ సిరీస్ ను భార‌త‌దేశంలో రూపొందించేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. అయితే ఒక కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ టీన్ డ్రామాలో మితిమీరిన కిస్సింగ్ సీన్లు, బోల్డ్ కంటెంట్ ఉండటంతో ఇది యువతను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ సిరీస్ సృష్టిస్తున్న హంగామా కారణంగా ఒకవేళ `ఆఫ్ క్యాంపస్` సిరీస్‌ను తెలుగులో రీమేక్ లేదా స్పిన్ ఆఫ్‌  రూపంలో తీసుకొస్తే అందులోని ప్రధాన పాత్రకు ఏ తెలుగు నటి సరిగ్గా సరిపోతుందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఇషా రెబ్బా, మాన‌స చౌద‌రి, కావ్య క‌ళ్యాణ్ రామ్ ఇంకా చాలా మంది ఇలాంటి వెబ్ సిరీస్ ల‌కు స‌రిపోతారు. మాన‌స పేరు ఎక్కువ‌గానే వినిపిస్తోంది. ఇక కావ్య అంద‌చందాలు హావ‌భావాలు మాతృక సిరీస్ లోని పాత్ర‌ల‌కు స‌రిపోతుంద‌ని కొంద‌రు సూచిస్తున్నారు. ఇక ఇషా రెబ్బా అందం జోరు కూడా ప్ల‌స్ అవుతాయ‌నే టాక్ ఉంది.

అయితే ఆఫ్ క్యాంప‌స్ టూమ‌చ్ బోల్డ్ సీన్స్ తో తెర‌కెక్కిన సిరీస్. ఆ రేంజులో చెల‌రేగిపోయే తెలుగ‌మ్మాయిలు ఉన్నారా? అనేదే ఇప్పుడు సందేహం. హ‌ద్దుమీరిన స‌న్నివేశాల్లో న‌టించేందుకు మ‌న‌వాళ్ల‌కు కొన్ని ప‌రిమితులు ఉంటాయి. దీంతో అమెరికన్ సిరీస్ రేంజులో ర‌క్తి క‌ట్టించ‌డం క‌ష్ట‌మేన‌నే అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది. అయితే ఓటీటీ విప్లవంలో ఏదైనా సాధ్య‌మేన‌నే వారు లేక‌పోలేదు. ప్రేక్షకుల అభిరుచుల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా న‌టీమ‌ణులు న‌టించేందుకు సిద్ధంగా ఉండాల‌ని చాలా మంది సూచిస్తున్నారు.

Major challenge For Telugu Actresess