రెండు వారాలు - 270 కొట్టిన సూర్య
Karuppu Two Weeks Box Office Collection
యావరేజ్ అనుకున్న సూర్య కరుప్పు ఇప్పుడు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో కళకళలాడుతుంది. కరుప్పు విడుదలైన రోజు జస్ట్ యావరేజ్ అంటూ క్రిటిక్స్ తేల్చేసారు. కానీ ఆడియన్స్ సూర్య కరుప్పు కోసం క్యూ కట్టారు. విచిత్రంగా తెలుగులోనూ వీరభద్రుడిగా విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగు ఆడియన్స్ కూడా ఆదరించారు.
దానితో రెండు వారాలు తిరిగేలోపు సూర్య రూ.270 కోట్లు కొల్లగొట్టాడు. జస్ట్ యావరేజ్ టాక్ తో సుర్య కరుప్పు ఈ రేంజ్ కలెక్షన్స్ తేవడం చూసి విమర్శకులు ఆశ్చర్యపోయారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన కరుప్పు లో ఫస్ట్ హాఫ్ చాలా బావున్నా సెకండ్ హాఫ్ లో సూర్య కి తక్కువ స్క్రీన్ స్పేస్ ఇవ్వడం, ఆర్జే బాలాజీ ఎక్కువ హైలెట్ అవడం చాలామందికి నచ్చలేదు.
అందుకే కరుప్పు కి మిక్స్డ్ రెస్పాన్స్ చూపించారు. అయినప్పటికి సూర్య కరుప్పు తో నిజంగా సెన్సేషన్ క్రియేట్ చేసారు. రెండు వారాలకు గాను కరుప్పు ప్రపంచ వ్యాప్తంగా రూ. 270 కోట్లు కలెక్షన్స్ సాధించింది.






































