దానిని మిస్ అవుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్
NTR fans are missing it
నందమూరి హరికృష్ణ మరణం తర్వాత కళ్యాణ్ రామ్ నందమూరి ఫ్యామిలీకి దూరం జరిగి జూనియర్ ఎన్టీఆర్ ని అక్కున చేర్చుకున్నారు. అప్పటినుంచి కళ్యాణ్ రామ్-ఎన్టీఆర్ లు సినిమా ఈవెంట్స్ కానివ్వండి, లేదంటే మారేదన్నా కుటుంబ కార్యక్రమాలు కానివ్వండి, తాతగారి సమాధి వద్దకు రానివ్వండి ఇలా అన్ని చోట్ల ఇద్దరూ కలిసి కనిపించేవారు.
రామ-లక్షణులుగా కనిపించే కళ్యాణ్ రామ్-ఎన్టీఆర్ లను చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉప్పొంగిపోయేవారు. కళ్యాణ్ రామ్ తారక్ ని నాన్న నాన్న అంటూ పిలవడం, కళ్యాణ్ అన్న అని ఎన్టీఆర్ సంబోధించడం అన్ని చాలా హైలెట్ అయ్యేవి. కానీ కొన్నాళ్లుగా అంటే దేవర విడుదల తర్వాత అన్నదమ్ములు కలిసి కనిపించిన సందర్భం లేదు.
కళ్యాణ్ రామ్-ఎన్టీఆర్ కలిసి కనిపించే ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిన్న ఎన్టీఆర్ ఒక్కడే కనిపించడం అభిమానులను డిజప్పాయింట్ చేసింది. అయితే కళ్యాణ్ రామ్-ఎన్టీఆర్ కలిసి కనిపించడానికి దేవర తర్వాత ఎన్టీఆర్ పబ్లిక్ ముందుకు వచ్చింది వార్ 2 తోనే. అది బాలీవుడ్ మూవీ. సో కళ్యాణ్ రామ్-ఎన్టీఆర్ కలిసే ఉన్నారు. కానీ నిన్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు రావడం కుదరలేదు అనేది కొంతమంది సన్నిహితుల సమాచారం.






































