రణ్వీర్ సింగ్ చుట్టూ బాలీవుడ్ కుట్ర?
Ranveer Singh has reportedly been banned
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ పై అక్కడ ఏదైనా కుట్ర జరుగుతుందా? ధురంధర్ తో బాలీవుడ్ లో నెంబర్ 1 స్థానంలో కూర్చున్న రణ్వీర్ పై ఇప్పుడు బ్యాన్ విధించడం హాట్ టాపిక్ అయ్యింది. ధురంధర్ తో రణ్వీర్ సింగ్ కి వచ్చిన ఫేమ్ చూసి ఓర్వలేకనే డాన్ 3 విషయంలో రణ్వీర్ సింగ్ ని ఇలా లాక్ చేశారనే టాక్ వినిపిస్తుంది.
డాన్ 3 సమస్యను రణ్వీర్ సాల్వ్ చేసుకుందామని అడిగినా ఫరాన్ అక్తర్ మాత్రం రణ్వీర్ పై నిషేధం విధించేలా చేసారని, దీని వెనుక బాలీవుడ్ లో పెద్ద పెద్ద వాళ్ళ హస్తం ఉంది అని, లేదంటే మూడేళ్ళ పాటు రణ్వీర్ సింగ్ తో సినిమాలు చెయ్యకూడదు అనే ప్రతి పాదన చెయ్యడమేమిటి అంటున్నారు.
రణ్వీర్ సింగ్ ఎదుగుదలను చూడలేని వారు చేసిన పనే ఇది అంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు కనిపిస్తున్నాయి. మరి నిజంగానే రణ్వీర్ పై బాలీవుడ్ లో కుట్ర జరిగిందా అనే అనుమానాలు ఇప్పుడు నెటిజెన్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు.







































