SM తగలడిపోయే అప్ డేట్ కావాలంట
Akkineni fans request to Nagavamsi
లెనిన్ టీజర్ ని ఎలాంటి హడావిడి లేకుండా విడుదల చేసిన మేకర్స్.. ఈసారి లెనిన్ నుంచి రాబోయే అప్ డేట్ సోషల్ మీడియా తగలాడిపోయే లాగ ఉండాలంటూ నిర్మాత నాగవంశీ ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. అఖిల్ లెనిన్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్ ఇకపై రాబోయే అప్ డేట్స్ విషయంలో నాగవంశీని తగులుకుంటున్నారు.
లెనిన్ సాంగ్స్, ట్రైలర్ చూసి సోషల్ మీడియా షేక్ కాదు తగలడిపోవాలంటూ వారు ట్వీట్స్ చేస్తున్నారు. లెనిన్ తో అఖిల్ ఈసారి గట్టిగా కొడుతున్నాడు, వస్తున్నాడురా మా వాడు అంటూ రెచ్చిపోయి అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నారు.
జూన్ ఫస్ట్ వీక్ పెద్ది కి వదలెయ్యండి, ఒకవేళ జూన్ మొదటివారం లో లెనిన్ అప్ డేట్స్ వదిలిన పెద్ది ముందు రీచ్ ఉండదు. అందుకే ఆ వారం పెద్దికి వదిలేసి తర్వాత 15 రోజులు లెనిన్ తో మాస్ జాతర ను తలపించేలా ప్రమోషన్స్ చెయ్యాలంటూ అక్కినేని అభిమానులు ఊగిపోతున్నారు.







































