Loading...

లెనిన్ సర్ ప్రైజ్ : మనోడు వస్తున్నాడురో


ఈరోజు మే 23. ఉరుము, మెరుపు లేకుండా వర్షం పడినట్లుగా లెనిన్ మేకర్స్ సర్ ప్రైజ్ షాకిచ్చారు. అఖిల్ అక్కినేని నటిస్తున్న లెనిన్ చిత్రం నుంచి టీజర్ వదిలారు. దానితో అక్కినేని అభిమానులు తెగ సర్ ప్రైజ్ అవుతున్నారు. అసలు ఉరుము, మెరుపు లేకుండా లెనిన్ టీజర్ ఊడిపడడానికి కారణం అక్కినేని నాగార్జున సినీ కెరీర్ ఆరంభించిన రోజు ఈరోజు మే 23.

తండ్రి నాగార్జున కు సర్ ప్రైజ్ గిఫ్ట్ అన్నట్టుగా అఖిల్ లెనిన్ టీజర్ వదిలారు మేకర్స్. దానితో నాగ్ కూడా ఎగ్జైట్ అవుతూ.. Today, May 23rd నా సిని జీవితం మొదలైన రోజు Akhil నాకో చిన్న surprise ఇచ్చాడు, చూస్తుంటే చాలా హాయి గా ఉంది, మీరు చూడండి.. అంటూ లెనిన్ టీజర్ లింక్ షేర్ చేసారు.

హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే బండిపై అఖిల్ కూర్చున్నాడు. ఆమె స్టేజ్ పై చెప్పిన పౌరాణిక డైలాగ్ గురించి మాట్లాడుకుంటారు. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే లపైనే ఈ టీజర్ కట్ చేసారు. అమ్మిలందరు తట్టుకొండి మనోడు వత్తున్నాడురో అంటూ అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్దిరిపోయింది.

భాజిశ్రీ బోర్సే - అఖిల్ కెమిస్ట్రీ. అక్క తమ్ముడి మద్యన ప్రేమ, నేను తప్పిపోయిరాలేదు మచ్చ మీ అందరిని వెతుక్కుంటూ వచ్చినా అంటూ అఖిల్ రాయలసీమ యాసలో చెప్పిన లాస్ట్ డైలాగ్ కి అక్కినేని ఫ్యాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయి. లెనిన్ సర్ ప్రైజ్ టీజర్ చూసిన అభిమానులు లెనిన్ తో అఖిల్ బాబు కొడతాడురా హిట్టు అంటూ సంబరపడుతూ కామెంటు పెడుతున్నారు.

Lenin Movie,Lenin Teaser released