Loading...

ఈ అక్కినేని ఫ్యాన్స్ గోలేమిటి


ఈరోజు మే 23. కింగ్ అక్కినేని నాగార్జున నటుడిగా కెరీర్ ప్రారంభించిన రోజు. నాగార్జున కు విషెస్ చెబుతూ అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో కోలాహలంగా ఉన్నారు. మరోపక్క అఖిల్ లెనిన్ టీజర్ మే 23 అంటూ సోషల్ మీడియాలో గత నాలుగు రోజులుగా తెగ హడావిడి చేస్తున్నారు.

లెనిన్ మేకర్స్ ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోయినా ఈరోజు మే 23 న లెనిన్ టీజర్ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. #LENIN Teaser Coming out Shortly ❤️‍🔥, #Lenin Teaser In Few Hours ❤️ Manodu Vasthunnadu…..🔥🔥🔥 after 5pm ...💥💥, With love మనోడు వస్తున్నాడు ❤️🏃 #Lenin, Finally lenin day vachesindhi ..ramp adinchali ayyagaaru 🔥😎 #lenin @AkhilAkkineni8 💪 అంటూ అక్కినేని ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.

మరి లెనిన్ మేకర్స్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. నిర్మాత నాగవంశీ కానీ, దర్శకుడు మురళి అబ్బూరి కానీ, నాగార్జున నుంచి కానీ లెనిన్ విషయమేమి బయటకు రాలేదు. కానీ అక్కినేని అభిమానులు జూన్ 26 న విడుదల కాబోయే లెనిన్ ప్రమోషన్స్, అప్ డేట్స్, టీజర్, సాంగ్స్ పై విపరీతమైన క్రేజ్ తో ఉన్నారు.

Lenin ,Lenin Teaser Update Coming Very Soon