Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Murder, Parole, Then Bollywood Career: Gujarat Actor Arrested After 12 Years

12 ఏళ్ల పరారీ తర్వాత దొరికిన హంతకుడైన‌ న‌టుడు!

 

గ్లామర్ ప్రపంచంలో వెలుగులు వెలిగే కొందరు నటీనటుల తెరవెనుక జీవితాలు ఎంత షాకింగ్‌గా ఉంటాయో నిరూపించే ఓ నమ్మలేని నిజం బాలీవుడ్‌లో వెలుగుచూసింది. అమీర్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, సన్నీ డియోల్ వంటి బాలీవుడ్ అగ్ర హీరోల చిత్రాలతో పాటు పలు పాపులర్ టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్‌లలో నటించిన ఓ 53 ఏళ్ల నటుడు అంతిమంగా ఓ హత్య కేసులో దోషిగా తేలడం సంచలనం సృష్టిస్తోంది. గత 12 ఏళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న ఈ నటుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేయడంతో సినిమా పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది.

నిందితుడి నేర చరిత్రను పరిశీలిస్తే ఒక పాత హత్య కేసులో కోర్టు ఇతనికి శిక్ష  విధించినా? చట్టం నుండి తప్పించుకోవడానికి ముంబై చిత్ర పరిశ్రమను ఒక సేఫ్ జోన్‌గా ఎంచుకున్నాడు. తన అసలు పేరును గతాన్ని పూర్తిగా దాచేసి చిన్న చిన్న పాత్రల ద్వారా బాలీవుడ్ సినిమాలలో టీవీ రంగంలో స్థిరపడ్డాడు. ఏకంగా అగ్ర నటుల పక్కన నటిస్తూ షూటింగులలో పాల్గొంటూ దాదాపు పుష్కర కాలం పాటు చట్టం నూతన నిఘా వ్యవస్థల నుండి తప్పించుకోవడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఎట్టకేలకు అందిన  సమాచారంతో నిఘా వర్గాలు అతడిని బంధించడంతో  సినిమాటిక్ పరారీకి ముగింపు పడింది.

ఈ ఘటనతో బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌లు -కాస్టింగ్ డైరెక్టర్ల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. సినిమాల్లో లేదా వెబ్ సిరీస్‌లలో క్యారెక్టర్ ఆర్టిస్టులను ఎంపిక చేసే సమయంలో వారి కనీస బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేయడం లేదనే పచ్చి నిజం ఈ ఉదంతంతో స్పష్టమైంది. ప్రమాదకరమైన హంతకుడు తమ మధ్యే తిరుగుతూ, తమతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడనే విషయం తెలిసి తోటి నటీనటులు భయాందోళనలు వ్య‌క్తం చేస్తున్నారు. గ్లామర్ ఇండస్ట్రీలో ముసుగు వేసుకుని తిరిగే ఇలాంటి క్రిమినల్స్ పట్ల భవిష్యత్తులో ప్రొడక్షన్ కౌన్సిల్స్ మరింత కఠినమైన నిబంధనలు ,గుర్తింపు కార్డుల విధానాన్ని తీసుకురావాలని విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు.

Gujarat Actor ,Murder, Parole, Then Bollywood Career: Gujarat Actor Arrested After 12 Years