దేవర 2 మర్చిపోండి

ఎన్టీఆర్ ఫ్యాన్స్ డ్రాగన్ గ్లింప్స్ తో ఎంతగా పండగ చేసుకుని దానిని సెలెబ్రేట్ చేసుకున్నారో అంతకు మించి దేవర 2 అప్ డేట్ విషయంలో డిజప్పాయింట్ అయ్యారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం పాన్ ఇండియా మార్కెట్ లో సో సో గా మిగిలిపోయినా అభిమానులు కంకణం కట్టుకుని హిట్ చేసారు.
దానికి సీక్వెల్ గా రావాల్సిన దేవర 2 విషయంలో రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బలమిస్తూ ఎన్టీఆర్ బర్త్ డే రోజున దేవరా 2 నుంచి బిగ్ అప్ డేట్ రాకపోవడం అభిమానులను తీవ్రగా నిరాశపరిచింది. దేవర1 పోస్టర్ నే వదిలి విష్ చేశారు కానీ.. కొత్త అప్ డేట్ లేదు అని ఫ్యాన్స్ నిరాశపడ్డారు.
ఇదంతా చూస్తుంటే కొరటాల తో ఎన్టీఆర్ దేవర 2 చెయ్యరనిపిస్తుంది. దేవర 2 ని ఇక మర్చిపోవాలా అనే మాట కూడా వినబడుతుంది. అందుకే దేవర 2 ని లైట్ తీసుకుని కొరటాల మూవ్ అవుతూ బాలయ్య తో సినిమాకి రెడీ అయ్యారు, ఎన్టీఆర్ కూడా డ్రాగన్ రెండు పార్టులు ఫినిష్ చేసే సరికి దేవర 2 మరుగున పడిపోతుంది అంటున్నారు.






































