పెద్ది సెన్సార్ రివ్యూ


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు తెరకెక్కించిన పాన్ ఇండియా ఫిలిం పెద్ది.. ఈ చిత్రం జూన్ 4 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది. జూన్ 3 సాయంత్రం నుంచే పెద్ది ప్రీమియర్స్ తో మెగా జాతరకు మేకర్స్ రెడీ అవుతున్నారు. పెద్ది టీజర్, గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్ అన్ని సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చెయ్యడంలో సక్సెస్ అయ్యాయి.

ప్రస్తుతం రామ్ చరణ్ ఇంకా హీరోయిన్ జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, బుచ్చిబాబు లు పెద్ది ప్రమోషన్స్ లో తలమునకలై ఉన్నారు. మరోపక్క పెద్ది సెన్సార్ పూర్తి చేసుకుంది. పెద్ది రన్ టైం 3 గంటల 03 నిముషాలు అంటే కాస్త లెంతి గానే పెద్ది థియేటర్స్ లోకి దిగబోతుంది.

ఇక పెద్ది చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు రామ్ చరణ్ కేరెక్టర్ సినిమాకి మెయిన్ పిల్లర్ గా నిలవబోతుంది అని, అందులోని ప్రతి ఆట ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది, పెద్ది యాక్షన్ సీక్వెన్స్, పాటలు ప్రధాన బలాలుగా నిలవనున్నాయని, ముఖ్యంగా రామ్ చరణ్-జాన్వీ కపూర్ మధ్యన కెమిస్ట్రి బాగా వర్కౌట్ అయ్యింది అని చెబుతున్నారు.

పెద్ది సెన్సార్ టాక్ చూస్తే పెద్ది థియేటర్స్ లో ప్రేక్షకుల ఆకలి తీర్చేస్తుంది. గత నాలుగు నెలలుగా ఆకలితో ఉన్న ఆడియన్స్ కరువు తీర్చేలా పెద్ది ఉండబోతుంది అంటూ వస్తున్న వార్తలు మెగా ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 

Peddi MoviePeddi Movie Censor Review